About Samaikyandhra Movement

2009 లో కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు సంబందించిన ప్రకటనను వెలువరించినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం రాజుకున్నప్పటికి శ్రీకృష్ణ కమిటీ నివేదికను సమర్పించినప్పటికీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎంత మాత్రం స్పందించని అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ ఓటు బ్యాంకును కాపాడుకునే కుయుక్తితో హటాత్తుగా జూలై 31వ తేదిన సిడబ్లుసీ తరపున తెలంగాణా విభజనకు సంభందించి ఏకపక్ష నిర్ణయాన్ని వెలువరించడంతో తిరిగి సమైక్యాంధ్ర అగ్గి రాజుకున్న విషయం అందరికి తెలిసిందే. సమైక్యాంధ్ర సాధనకై సీమాంధ్రకు చెందిన అన్ని సామజిక వర్గాలు తమదైన శైలిలో గత నెల రోజులుగా నిరసన ప్రధర్సనలను నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు.

స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీతో కలసి ఉన్న నేపధ్యంలో పొట్టి శ్రీ రాములుగారు ప్రేత్యేకాంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ దీక్షను పూనుకొని అసువులు బాసినప్పుడు కర్నూల్ రాజధానిగ ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది. అప్పుడు తెలంగాణా రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రానికి విడిగా హైదరాబాద్ రాజధానిగా ప్రత్యెక ఉనికిని కలిగి ఉండేది ఆయితే భాష ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు తెలుగు భాషియులకు ఒకే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించి, హైదరాబాదును రాజధానిగా ఏర్పరచటం జరిగింది.

ఒకవేళ వారు తమది కానటు వంటి రాజధానిలో ప్రవేశించి అక్కడి నివాసితులపయ్ ప్రాబల్యం వహిస్తూ, వారికి ఆన్యా యము చేస్తూ వ్యవహరించినట్లు అయితే అది తప్పుడు చర్య అవుతుంది కాని హైదరాబాద్ తెలుగు భాషియులు అందిరికి రాజధానిగా నిర్ణయించినపుడు సీమాంధ్రులు వున్నత చదువులు చదువుకొని, తమ ప్రతిభా పాటవాలతో హైదరాబాద్లో ఉద్యోగాలను సంపాదించుకొని, తమ కష్టార్జితంతో పరిశ్రమలు స్థాపించుకొని అభివ్రుది పరచు కుంటే తప్పు ఏంటి? తమ స్వీయ కష్టార్జితంతో అక్కడ స్థిర చరస్తులను ఏర్పరచు కుంటే తప్పు ఏంటి?

ఇంకా వుంది

What are people saying...




bottom